Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘటనకు కారకులైన ఉపాధ్యాయున్ని తక్షణమే అరెస్ట్ చేయాలి
- డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు హరికృష్ణ
నవతెలంగాణ-ఇల్లందు
అన్నపురెడ్డిపల్లి ఎస్సీ గురుకులంలో పనిచేస్తున్న సైన్సు ఉపాధ్యాయురాలు కళ్యాణి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డీవైఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాలంగి హరికృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆమె మృతి అనేక రకాల అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని, అది ఆత్మహత్య కాదు హత్య అని అన్నారు. రొంపెడు గ్రామపంచాయతీలో పుట్టి గిరిజన బిడ్డగా ఎదిగి మారుమూల ప్రాంతమైన అన్నపురెడ్డిపల్లి గ్రామంలో ఎస్సీ గురుకులంలో పురుష అధ్యాపకుల మధ్యలో ఉన్న ఏకైక మహిళా ఉపాధ్యాయురాలుపై జరిగిన అవమానకర భాషల ఆధారంగా ఆమెకు జరుగుతున్నటువంటి సంఘటనలు ఆధారంగా చేసుకొని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనిపిస్తోందన్నారు.
మరొక కోణంలో అక్కడ అధ్యాపకుల మధ్య జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలలో భాగంగా ఉపాధ్యాయుల మధ్య ఉన్న చిచ్చు కళ్యాణి అనే ఉపాధ్యాయురాలి పై మోపి కొంత మంది అధ్యాపకుల పైశాచిక ఆనందం కోసం గిరిజన ఉపాధ్యాయురాలిని బాలి తీసుకున్నారని అన్నారు. ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని పరారీలో ఉన్న తెలుగు టీచర్ని కస్టడీలోకి తీసుకోవాలని అక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బందిని, హెడ్మాస్టర్ విచారణలో చేర్చాలని వెంటనే ఆమె నివసిస్తున్న అటువంటి గదిని స్వాధీనం చేసుకొని ఆమె మరణాన్ని పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉపాధ్యాయ లోకానికి అండగా నిలవాలని కోరారు.