Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
శ్రీ శ్రీ కళా వేదిక తెలంగాణ బాషా సంస్కృతిక శాఖ సంయుక్త అధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో భద్రాచలం ఏజెన్సీకి చెందిన పలువురు కవులు తమ ప్రతిభను చాటి జాతీయ పురస్కారాలు పొంది ఏజెన్సీకి వన్నే తెచ్చారు. చర్లకు చెందిన సిద్దార్థ ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ కుమార్ చర్ల, భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ తాటి మల్లేష్, చర్ల చెందిన తెలుగు ఉపన్యాసకులు తంగేళపల్లి సంకరచారీ భద్రాచలం పట్టణానికి చెందిన న్యాయవాది పామారాజు తిరుమల రావు, మోరంపల్లి పంచాయతీ మేడిపల్లి సాయిలకు పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సమ్మేళనంలో తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహి అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొల లక్ష్మి ప్రముఖ సినీ జానపద గేయరచయిత, ఎంఎల్సీ గోరటి వెంకన్న, శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్లు మాట్లాడారు. సమా జంలోని రుగ్మతలను తొలగించే సామర్ధ్యం కవులకు సాహితీ వేత్తలకు వుందన్నారు. శ్రీ శ్రీ కళా వేదిక అధ్వర్యంలో జాతీయ స్థాయిలో కవులను ప్రోత్చహించడం అభినందనీయం అన్నారు.
శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ కార్యవర్గం బోయి హైమవతి, కొల్లి రమవతి, చిట్టే లలిత, రిషి తణుకు, మిరప మహేష్, శశిరేఖ, వాసి జ్యోస్న తదితరులు పాల్గొన్నారు.