Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో నిలుపుతున్నాడని బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. శుక్రవారం మండలంలోని అంజనాపురం గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వవిప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశానుసారం టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికీ కేసీఆర్...గ్రామగ్రామానికీ టీఆర్ఎస్ అనే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రతి కుటుంబానికి అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం అధికార ప్రతినిధి నల్లమోతు సురేష్, బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, అంజనాపురం సర్పంచ్ భూక్యా భారతి, సీనియర్ నాయకులు బెల్లంకొండ రామారావు, టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు లలిత, మండల బీసీ సంఘం అధ్యక్షులు వీర్రాజు, టీఆర్ఎస్ కార్మిక విభాగం మండల అధ్యక్షులు మర్రి సాంబారెడ్డి, జిల్లా దిశ కమిటీ మెంబర్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు వేణు, పాల్గొన్నారు.