Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
బూర్గంపాడు మండలం సారపాకలో గల ఐటీసీ ఫంక్షన్ హాల్ నందు ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఈతకోటి వరప్రసాద్ మెమోరియల్ వాలీబాల్ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. ఈ టోర్నీలో మూడు జిల్లాలకు చెందిన టీమ్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీని ఐటీసీ టీఎన్టీయూసీ అధ్యక్షుడు కనకమేడల హరిప్రసాద్, బూర్గంపాడు మాజీ జెడ్పీటీసీ బట్టా విజరు గాంధీ, స్థానిక సర్పంచ్లు పుల్లారావు, తుపాకుల రామలక్ష్మి, స్థానిక నాయకులు తాత మాధవిలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఆదర్శవంతమైన వాలీబాల్ టోర్నీలను నిర్వహించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.