Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
అక్రమంగా నిల్వ ఉంచిన రూ.12 లక్షల విలువ చేసే గుట్కాలను ఖమ్మం రూరల్ పోలీసులు పట్టుకున్న సంఘటన మండల పరిధిలోని వెంకటగిరి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని జలగంనగర్ కు చెందిన భరత్ అనే వ్యక్తి ఇతర ప్రాంతాలనుండి పెద్దఎత్తున గుట్కాలను తీసుకువచ్చి వెంకటగిరి ప్రాంతంలోని ఓ పాడుబడిన గోదాంలో నిల్వ ఉంచాడు.ఈ విషయం తెలుసుకున్న రూరల్ పోలీసలు గోదాంలో సోదాలు చేయగా గట్కాలు పట్టుబడ్డాయి.పట్టుకున్న గుట్కాల విలువ సుమారు రూ.12 లక్షల ఉంటుందని తెలిపారు.గుట్కాల వ్యాపారి భరత్ పరారీలో ఉన్నాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.