Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి బాలరాజు
- బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ బ్యాంకుల సవరణ చట్టం బ్యాంకు ఉద్యోగస్తుల కంటే సామాన్య ప్రజలకు నష్టమని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు అన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణను పారిశ్రామిక వేత్తలకు బ్యాంకు ఏర్పాటుకు అనుమతులను నిరసిస్తూ రెండు రోజులుగా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సీపీఐ(ఎం) కొత్తగూడెం పట్టణ నాయకత్వం సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 18 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని వారి పోరాటం వేతనాలు ఇంక్రిమెంట్లు కోసం కాదని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడం కోసం చేస్తున్న పోరాటం అని ఆయన కొనియాడారు. పోరాడే శక్తులకు సీపీఐ(ఎం) ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జునుమాల నగేష్, పట్టణ నాయకులు డి.వీరన్న, సమ్మయ్య, లింగన్న, రాజారావు, మల్లయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.