Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో శ్రీవిద్య టెక్నో జూనియర్ కళాశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 462 మార్కులు సాధించి అశోక్ రాష్ట్రస్థాయి ఆరో ర్యాంకు సాధిం చాడు. అదేవిధంగా రమ్య శ్రీ 458, జ్ఞాన ప్రకాష్ 456, ఎం అర్చన 456 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ర్యాంక్ సాధించారు. అలాగే ఎంపీసీ విభాగంలో 26 మంది 400 మార్కులు పైగా సాధించారు. అలాగే నూరు శాతం ఉత్తీర్ణత సాధించినది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం కేవలం శ్రీవిద్య కే సాధ్యం అని నిర్వాహకులు తెలిపారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులను శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ నిరోషా రెడ్డి, రాధిక స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి, కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ రవి ప్రసాద్ రెడ్డి, అధ్యాపకులు చెన్నారెడ్డి, బాలకృష్ణ, ప్రభాకర్, రమణ, వెంకటేశ్వరరావు, వీరప్రసాద్ ,విజయకుమారి, రమేష్,సాయి ప్రియ, వీరూ నాయక్, కళాశాల సిబ్బంది అభినందించారు.
జీఓ 317ను సవరణ చేయాలి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గిరిజన ఉద్యోగ, ఉపాద్యాయులకు నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన జీఓ 317ను సవరణ చేయాలని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కారం సర్వేశ్వరరావు దొర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తపల్లి ఆశ్రమ వసతి గృహంలో మధ్యాహ్న బోజన విరామ సమయంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యంపి.నాయక్ అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో సర్వేశ్వరరావుదొర పాల్గొని మాట్లాడారు. జిఓ 317తో ఉద్యోగ, ఉపాద్యాయులకు ఎటువంటి నష్టం వాటిల్లినా ఊరుకునేది లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీఓ 317 తీసుకు వచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రభుత్వం ఉరుకులు పెట్టిస్తుందని ఇది సరైన పద్ధతి కాదన్నారు. భారత రాజ్యాంగంలో ఏజన్సీ ప్రాంత గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం కల్పించిన ప్రత్యేక హక్కులను కాపాడాలని, జోనల్, మల్టీ జోనల్ జిల్లాల సర్దుబాటు ఎజన్సీ, మైదాన ప్రాంతాలకు వేరు, వేరుగా చేయాలన్నారు. మాలోత్ ప్రతాప్ సింగ్ మాట్లా డుతూ జిఓ 317 పేరిట లేని పోని సవరణలు చేసి ఉద్యోగ సంఘాల ప్రైమే యం లేకుండా ఎలా సవరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఉపాద్యాయులు ముత్తయ్య, ఈశ్వర్, కళ్యాణి, సుకన్య, చిట్టిబాబు పాల్గొన్నారు.