Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఈ నెల 22వ తేదీన ఆళ్ళపల్లి మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో మండలంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యధికంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాయం నరసింహారావు, షేక్ బాబా పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రములోని ఎంపీడీవో కార్యాలయం ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి ఛాంబర్లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వస్తున్న స్థానిక ఎమ్మెల్యేకు సమస్యలు తెలిపి పరిష్కారానికి మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న కింది స్థాయి ఉద్యోగస్తులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కొమరం హనుమంతరావు, మర్కోడు సర్పంచ్ కొమరం శంకర్ బాబు, టీఆర్ఎస్ మండల నాయకులు ఎండీ.అతహార్, వూకె కిశోర్ బాబు, ఎండీ.ఖయ్యుం, కృష్ణ, ప్రసాద్, పాల్గొన్నారు.