Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, తుడుందెబ్బ డిమాండ్
- కలెక్టర్ అనుదీప్‌కు వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
అన్నపురెడ్డిపల్లి గురుకులంలో పనిచేస్తున్న ఆదివాసీ ఉపాధ్యాయురాలు కళ్యాణికి న్యాయం చేయాలని, తన మరణానికి కారకులైన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్, పీఈటీలను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేసాయి. శుక్రవారం అన్నపురెడ్డి గురుకులం పాఠశాల ఉపాధ్యాయురాలు మరణంపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాళంగి హరికృష్ణ, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరరావు మాట్లాడుతూ బాధిత ఉపాధ్యాయురాలు కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, డబల్ బెడ్రూమ్ ఇల్లు, రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళా టీచర్లపై ఈ తరహా దాడులకు పాల్పడితే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలన్నారు. బాధితురాలి కుటుంబానికి గురుకుల సోషల్ వెల్ఫేర్ సొసైటీలో ప్రభుత్వ ఉద్యోగం కేటాయిస్తామనీ, నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సండ్ర భూపేందర్, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టి శ్రీను, అన్నపురెడ్డి పల్లి ఎంపీపీ సున్నం లలిత, అన్నపురెడ్డిపల్లి ఆదివాసీ జేఏసీ మండల అధ్యక్షులు మడివి నాగేంద్రబాబు, ఉప సర్పంచ్ తాటి రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
సమగ్రవిచారణ జరిపించాలి : పీడీఎస్‌యూ
అన్నపురెడ్డిపల్లి ఎస్సీ గురుకులంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు అనుమానాస్పద మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆమె మృతి అనేక రకాల అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకురాలు జె.మంజుల అన్నారు. ఎస్సీ గురుకులంలో పురుష అధ్యాపకుల మధ్యలో ఉన్న ఏకైక మహిళా ఉపాధ్యాయురాలుపై జరిగిన అవమానకర మా టల ఆధారంగా ఆమెకు జరుగుతున్నటువంటి సంఘ టనలు బేస్ చేసుకొని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనిపిస్తుందని తెలిపారు. ఆమె మర ణంపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.