Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ద్వాదశ జ్యోతిర్లింగాలు, పరివార దేవతల ప్రతిష్ట
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని భద్రాచలం పర్ణశాలకు వెళ్లే రహదారిలో నర్సాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం (చిన్న అరుణాచలం)లో జరుగుతున్న ద్వాదశ జ్యోతిర్లింగాల విగ్రహ ప్రతిష్టా మహౌత్సవాలు శుక్రవారం రెండవ రోజు వైభోపేతంగా కొనసాగాయి. మహాభిషేకంలో భాగంగా గోదావరి నుండి తెచ్చిన పవిత్ర జలాలతో ప్రదాన కళశాల అవాహన కార్యక్రమం, స్వామి వారు యాగశాల ప్రవేశం వంటి హౌమాలు పూజలను తిరుపతి నుండి వచ్చిన వేద పండితుల మంత్రోచ్చరణా మద్యం దివ్యంగా నిర్వహించారు. హౌమాలలో భాగంగా స్వామి వారిని దాన్యాది వాసం నుండి జలాది వాసం పెట్టే కార్యక్రమం నిర్వహించారు. సైనాది వాసం, మూల మంత్రాల నడుమ ప్రత్యేక హౌమ పూజలు నిర్వహించారు.
నేడు జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ : నర్పాపురం గ్రామంలో జరుగుతున్న జ్యోతిర్లింగాల విగ్రహ ప్రతిష్ఠా మహౌత్సవాలలో భాగంగా నేడు అభిజిత్ లగమందు ఉదయం 11.37 గంటలకు ద్వాదశ జ్యోతిర్లింగాలు, పరివార దేవత ప్రతిష్టా మహౌత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు శివనాగస్వామి తెలిపారు. మొత్తం ఆలయంలో 68 విగ్రహాల మహా ప్రతిష్టా మహౌత్సవాన్ని అత్యంత వైభోపేతంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి రోజు భక్తులకు అన్న ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అరుణాచలేశ్వర స్వామిని కృపకు పాత్రులు కావాలని ఆయన కోరుతున్నారు.