Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
మిర్చి సాగు చేస్తున్న రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపోయిన మిర్చి పంటను సర్వే చేసి ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం అందిం చాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చింతకాని మండలం కొదుమూరు గ్రామంలో సిపిఎం బృందం దెబ్బతిన్న పంటలను శుక్రవారం పరిశీలించారు. రైతులు ఎకరానికి లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన పంట రోగాల బారిన పడి అప్పులు మిగిలాయని, తెలిపారు. దెబ్బతిన్న మిర్చి రైతులందరు ఈ నెల 20న ఖమ్మంలో మిర్చి రైతుల మహా ప్రదర్శన కలెక్టర్ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు చింతకాని సహకార సంఘం ఉపాధ్యక్షులు మాదినేని రవి, సిపిఎం మండల కమిటీ సభ్యులు రాచబంటి రాము, రైతులు చిట్టిమోదు పెద్ద లింగయ్య, బయ్య శ్రీను, చిన్న లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : మిర్చి తోటలు దెబ్బతిని నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని కస్నాతండా గ్రామంలో దెబ్బతిన్న మిర్చి పంటలను శుక్రవారం సీపీఎం ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా బండి రమేశ్ మాట్లాడారు. ఇప్పటికే రైతులు ఎకరానికి సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారని,ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధుల బారినపడ్డ మిర్చి తోటలు పూత,కాపులేకుండానే నిలువునా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.కార్యక్రమంలో మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, నాయకులు ఉరడీ సుదర్శన్ రెడ్డి, తోట పెద్దవెంకటరెడ్డి, నందిగామ కృష్ణ, భూక్య నాగేశ్వరరావు, సైదులు, చంద్రయ్య, కుక్కల సైదులు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : వైరస్ తెల్ల దోమ నల్ల దోమ ఎర్ర నల్లి వలన నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రైతు సంఘం మండల కమిటీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి మండలంలోని బలరాం తండాలో సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్చి పంట సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, రైతు సంఘం జిల్లా నాయకుడు తుళ్లూరు నాగేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు వేగినాటి వెంకట్రావు, దొండేటి సుగుణమ్మ పాల్గొన్నారు.
పెనుబల్లి : మిర్చి రైతులను తక్షణమే ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గాయల తిరుపతిరావు అన్నారు. పార్టీ జనరల్ బాడీ సమావేశం స్థానిక చలమల సూర్యనారాయణ భవన్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్చి రైతుల కోసం 20న ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నా జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు భూక్యా ప్రసాద్, సండే సత్యం, గుడిమెట్ల బాబు, కలకోట అప్పారావు, ఏం. బాజీ,చలమల నరసింహారావు, నల్లమల ప్రతాప్, చెమట విశ్వనాథం పాల్గొన్నారు.