Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలంలో తెగుళ్లతో దెబ్బతిన్న మిర్చి పంటలను సీపీఐ(ఎం) ప్రతినిధి బృంధం శుక్రవారం పరిశీలించింది. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) బృందం ఎర్రబోడు, చీమలపాడు, బాజుమల్లాయిగూడెం గ్రామాల్లో వైరస్, నల్లి, పొట్టి రోగాలతో దెబ్బతిన్న రైతుల మిర్చి తోటల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడారు. మిర్చి పంటకు రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉన్నామని నల్లి దెబ్బకు తోటలను వదిలేసుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు మాఫీ కాక బ్యాంకులు అప్పులు ఇవ్వక పంటను రక్షించుకోవటానికి అధిక వడ్డీకి అప్పుతెచ్చి మరి సాగు చేశామని అయినా చీఢపీడలు తమను ముంచాయని రైతులు తమ బాధను వ్యక్తం చేశారు. రోగాలతో తోటలు ఎదగలేదని, వచ్చిన పూతకు నల్లి సోకి ఊడుచుక పోయిందని తెలిపారు. ఈసందర్భంగా సీపీఐ(ఎం) మండలకార్యదర్శి కే.నరేంద్ర మాట్లాడుతూ కౌలు రైతుల పరిస్ధితి మరింత దారుణంగా తయారైందన్నారు. దీనికంతకి కారణం ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. నకలీ విత్తనాలు పురుగుమందులు అరికట్టటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు బంధువుగా చెప్పుకుంటున్న కైసీఆర్ రైతులు తెగుళ్ల బాధలతో ఎకరాలకు ఎకరాలు పోతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మిర్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరారు రూ.లక్ష పరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ఈనెల 21వ తేదిన ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాలో రైతులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పండగ కొండయ్య, మాలోత్ రాంకోటి, వల్లెబోయిన కొండలరావు, యనమగండ్ల రవి, రైతులు అజ్మీర శోబన్బాబు, కాటికాల బుచ్చయ్య, బానోత్ చందర్, భూక్యా కృష్ణ, నాగు, మాలోత్ రాంబాబు, పందుల వీరయ్య, కిషన్, మాజీ సర్పంచ్ భూక్యా వాచ్యా తదితరులు పాల్గొన్నారు.