Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి పోచవరం నుండి ప్రారంభం
- ప్రారంభించనున్న ఏపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం
నవతెలంగాణ-భద్రాచలం
ఎట్టకేలకు పాపికొండల పర్యాటక విహారయాత్ర నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండనుంది. అమితంగా పర్యాటకులను ఆకట్టుకునే పాపికొండల పర్యా టక బోటు విహార ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ తెలంగాణ నుంచి వెళ్లేందుకు అనుమతులు ఇవ్వటంతో శనివారం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. దీంతో సుమారు 26 నెలల సుదీర్ఘ విరామం తర్వాత గోదావరి అందాల నడుమ పర్యాటక విహార యాత్ర ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనతో తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకుల సందడి ప్రారంభం కాను ంది. కాగా గత నెల 7వ తేదీన రాజమహేంద్రవరం పోచమ్మ గండి బోట్ పాయింట్ నుంచి యాత్ర ప్రారంభమైంది. ఈ క్రమంలో పోచవరం ఫెర్రి పాయింట్ నుంచి 12 బోట్లకు అనుమతి రాగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 8 బోట్లు సిద్ధం కావడంతో అధికారులు ఇందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పాయింట్ నుంచి పాపికొండలు యాత్ర శనివారం నుంచి ప్రారంభం కానుంది.
26 నెలల తర్వాత....
ఏపీ రాష్ట్రంలోని పాపికొండల పర్యాటక విహార యాత్రకు విపరీతమైన క్రేజు ఉంది. అయితే 2019వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు లో బోటు ప్రమాదం జరిగింది. దీంతో యాత్ర నిలిచి పోయింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ని బోటు నిర్వాహకులు, బోటు ఆపరేటర్లు తదితర కుటుం బాలపై తీవ్రంగా పడింది. ఇదిలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా పోచమ్మ గుడి నుంచి ఇకపై పాపికొం డలు పర్యాటక యాత్ర సాగనుంది. శనివారం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా వర రామచంద్రపురం మండలం పోచవరం పెర్రీ పాయింట్ నుంచి శనివారం యాత్ర ప్రారం భం కానుంది. ఈ పాపికొండలు విహార యాత్ర ను తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంత బాబు, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఏపీ టూరిజం, పోర్టు అధికారులు చేతుల మీదుగా ఈ యాత్ర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
టిక్కెట్లు ధరల వివరాలు ఇలా...
పాపికొండలు విహార యాత్ర బోటు పాయింట్ నుంచి వెళ్ళేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులకు, పెద్దలకు ధరలను కేటాయించింది. చిన్నారులకు రూ.730, పెద్దలకు రూ.930 ధరగా ప్రభుత్వం నిర్ణయించారు. అదేవిధంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు గ్రూపులుగా వస్తే రూ.830 ప్యాకేజీ ధరను నిర్ణయించినట్లు తెలిసింది. అదేవిధంగా పాపికొండలు విహార యాత్రకు వెళ్లేందుకు భద్రాచలంలో టికెట్ బుకింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే ఆన్లైన్లో విక్రయాలపై త్వరలో ప్రకటించనున్నారు.
పాపికొండల యాత్రతో భద్రాద్రికి కళ...
తెలంగాణ రాష్ట్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పాపికొండల పర్యాటక యాత్రకు వెళ్లాలంటే ముందుగా భద్రాద్రి రామయ్య దర్శించుకుని వెళ్తుంటారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం పర్యాటక విహార యాత్రకు గ్రీన్ సిగల్ ఇవ్వడంతో భద్రాచలంలో ఇప్పటివరకూ మూతపడ్డ బోటు నిర్వాహకులు ఏజెంట్ కార్యాలయాలకు కొత్త కళ సంతరించు కుంది. అదేవిధంగా పర్యాటకులు, భక్తులు భద్రాచలం రామయ్య దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి విహార యాత్రకు బయలు దేర నుండడంతో రామయ్య ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నా యి. ఈ క్రమంలో పాపికొండల యాత్రకు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా వెళ్తుంటారు. సెలవు రోజుల్లో పర్యాట కులు అధికంగా వస్తుంటారు. శనివారం నుంచి ఈ పాపికొం డలు యాత్ర తిరిగి ప్రారంభం కానుండటంతో పర్యాటకుల్లో, వ్యాపారు లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.