Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ కాలేజీల కోసం పనిచేస్తున్న ఇంటర్ బోర్డు
కార్యదర్శిని తొలగించాలి : ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో అనేక మంది విద్యార్దులకు తక్కువ మార్కులు రావడం ఇంటర్ బోర్డు వైపల్యానికి నిదర్శనమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్ అన్నారు. కరోనా కారణంగా విద్యార్థులకు సరిగ్గా క్లాస్‌లు జరగలేదని, విద్యార్థులు కూడా పరీక్షలు రాయడానికి సంసిద్ధంగా లేరన్నారు. అలాంటి సమయంలో పరీక్షలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. ఇంటర్ బోర్డు తప్పుడు నిర్ణయాల వల్ల ఇంత తక్కువ రిజల్ట్ వచ్చిందన్నారు. ఇప్పుడు వచ్చిన రిజల్ట్‌లో ఫెయిలైన విద్యార్థుల్లో కొందరు పదో తరగతిలో 10/10 జీపీఏ గ్రేడ్ వచ్చిన వారు కూడా వుండటం ఈ పరీక్షల నిర్వహణ సమంజసం కాదనే విషయాన్ని తెలియజ ేస్తోందన్నారు. ఇప్పటికైనా ఫెయిలైన విద్యార్థుల్లో ఆందోళనను, ఒత్తిడిని నివారించ డానికి బోర్డు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధిక మార్కుల కోసం మరోసారి పరీక్షలు నిర్వహించాలని, తక్షణమే పునర్మూల్యాంకనం చేపట్టాలని కోరారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే పూర్తిగాబాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శాంతియుత పద్దతిలో ఇంటర్ బోర్డు ముందు నిరసన చేస్తుంటే ఎస్ఎఫ్ఐ నాయకులను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని, అరెస్టులు ఎన్ని చేసినా విద్యా ర్థులకు సరైన న్యాయం జరిగే వరకు ఎస్ఎఫ్ఐ ఉద్యమిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ రేబినా, సోఫియా, మౌనిక, దివ్య, నాగలత తదితరాలు పాల్గొన్నారు.