Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ఆర్ట్స్ క్రాఫ్టు విభాగంలో సృజనాత్మకతను చాటిన మండల పరిధిలో పోలేపల్లిలోని కేంద్రీయ విద్యాలయ విద్యార్థినీ నూనావత్ మేఘనకు జాతీయ బాలశ్రీ అవార్డును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో అందజేశారు. జాతీయ బాలశ్రీ అవార్డు అందుకున్న మేఘనకు కేంద్రీయ విద్యాలయంలో శనివారం అభినందన సభను ఏర్పాటు చేసి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఇస్లాంఖాన్ మాట్లాడారు. 2015-16 ఏడాదిలో బాలశ్రీ అవార్డుకు ఎంపికయిన విద్యార్థులకు ఈ ఏడాది పురస్కారాలను అందజేశారని గుర్తు చేశారు. బాలశ్రీ పురస్కారంతో పాటుగా రూ.15 వేలు నగదు అందజేశారని తెలిపారు. పురస్కారం అందుకున్న మేఘనను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ టీఎల్.ప్రసన్నకుమారి, అధ్యాపకులు పాల్గొన్నారు.