Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అదనపు కలెక్టర్‌కి ఎస్ఎఫ్ఐ వినతి
అ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్
నవతెలంగాణ-పెనుబల్లి
కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలోని అదనపు కలెక్టర్ మదన్ మోహన్‌కు శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జమ్మి.అశోక్ మాట్లాడుతూ పెనుబల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీ చేయకుండా విద్యార్థుల ఎలా చదువుతారని కళాశాలలో 200 మంది విద్యార్థులు చదువుతున్నారని లెక్చరర్లు లేకుండా ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ. జువాలజీ ఎవరు బోధిస్తారని ప్రశ్నించారు. ఎలా చదువుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం మాని వెంటనే పెనుబల్లి కేంద్రంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు గెస్ట్ ఫ్యాకల్టీ నియమించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎక్కడ సరేనా ఇంటర్ రిజల్ట్ లేక పోవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అన్నారు. ఆన్లైన్లో క్లాసులు పేరుతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డ్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్, ఇతర నాయకులు బెజవాడ సాయి శేషు, స్వామి, మనోహర్, దుర్గ, పావని, లక్ష్మి చైతన్య నాయకులు పాల్గొన్నారు.