Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నిరసనలతో దద్దరిల్లిన డీఈఓ కార్యాలయం
నవతెలంగాణ-గాంధీచౌక్
జీఓ నెంబర్ 317ను సవరించాలని, స్థానికత కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టులపై వచ్చిన అప్పీల్స్ అన్నిటింనీ పరిశీలించి సీనియార్టీ లిస్టులో జరిగిన పొరపాట్లను సవరించాలని, సవరించిన లిస్ట్స్ ఉపాధ్యాయుల పరిశీలనకు ఉంచాలని, ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా చూడాలని యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తగు సమయం ఇచ్చి ఆప్పీల్స్ అన్నింటినీ పరిష్కరించి, సమగ్రమైన సీనియార్టీ లిస్టు రూపొందించిన తర్వాతనే జిల్లాల కేటాయింపు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావ దుర్గాభవాని, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు, షేక్. మహబూబ్ అలీ, నాయకులు బుర్రి వెంకన్న, వి. రాంబాబు, కృష్ణ, రంజాన్, వెంకటేశ్వర్లు, ఎం.వెంకటేశ్వర్లు, పి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.