Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సొసైటీ చైర్మెన్
మండె వీర హనుమంతరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
రైతులు సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం సహకార సంఘం సొసైటీ చైర్మన్ మండె వీర హనుమంతరావు కోరారు. శనివారం విద్యానగర్లోని సొసైటీ కార్యలయంలో సంఘ కార్యవర్గ సమావేశం జరిగినది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు మండె వీరహనుమంతరావు మాట్లాడుతూ... సంఘ పరిధిలో మొత్తం 8 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ఏఈఓ వద్ద కూపన్ తీసుకొని తమ ధాన్యం 17 శాతం లోబడి ఆరిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావలని కోరారు. రైతుల ఖాతలో వెంటనే నగదు జమ చేయటం జరుగుతుందని, కావున రైతులు తమ ధాన్యంనకు ప్రభుత్వ మద్దతు ధర రూ.1960లను క్వింటాకు పొంది, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకో వాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన రుణా మాఫీ నిధులు రూ.50,000 లోపు గలవారికి రూ.1.19 లక్షలు విడుదలయ్యాయని వాటి వివరములు కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. సంఘంలో భావి, ద్విచక్రం, గెదేల రుణాలను వెంటనే చెల్లించాలని, లేకపోతే ది జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లి, ఖమ్మం వారు తీసుకొను చర్యలకు బాధ్యులు కాగలరని తెలిపారు. అలాగే సంఘం ద్వార పంట రుణాలు తీసుకొన్న రైతులు పావల వడ్డీని చెల్లించి రెన్యూవల్ చేసుకొనగలరని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సొసైటి సీఈఓ పి.సారయ్య, సొసైటీ డైరెక్టర్లు బండి అమృత రావు, గుగులోత్ చందర్, తీట్ల విజయకుమారి, లావుడ్య చరణ్ కుమార్, పోటు వెంకటేశ్వర రావు, మాళోత్ సేవ్యా, చంద్రగిరి శ్రీనివాస్ రావు, కంటెం సత్యనారాయణ పాల్గొన్నారు.