Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అండగా ఉంటాం...
అ బూర్గంపాడు జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆవుల మోహన్ రెడ్డి లక్ష్మీపురంలో గల ఫిమాకేం కంపెనీలో పనిచేస్తుండగా ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో మరణించారు. ఈ మేరకు శనివారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, రామకొండా రెడ్డి దంపతులు పరామర్శించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ అధైర్యపడొద్దు ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి నల్లమోతు సురేష్, స్థానిక వార్డుసభ్యులు పాలం దివాకర్ రెడ్డి, టీఆర్ ఎస్ మండల నాయకులు నల్లమోతు జానకి రామయ్య, గాదె నర్సిరెడ్డి, టీఆర్ ఎస్ నాయకులు బోయిన నరేష్, నన్నపనేని నరేష్, బోళ్ల నాగేశ్వరరావు, క్రిష్ణయ్య, మంగమ్మ, వీరయ్య, నాగేశ్వరరావు స్థానికులు తాళ్లూరి శ్రీహరి బాబు, బాదం రమేష్ రెడ్డి,పొందూరి రాము, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పీటీసీ
బూర్గంపాడు మండల పరిధిలోని నకిరిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ చర్పా వెంకటేశ్వర్లు తల్లి చుక్కమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. శనివారం వారి నివాసానికి వెళ్లి సర్పంచ్ కుటుంబ సభ్యులను బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధికార ప్రతినిధి సురేష్, తెలంగాణ ఉద్యమ కారులు పోడియం నరేందర్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు బోళ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.