Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఇంటర్ ప్రథమ సంవత్సరం
విద్యార్ధులను పాస్ చేయాలి
అ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ఎనిమిది మంది ఇంటర్ ప్రధమ సంవత్సరం విద్యార్ధుల ఉసురు తీసిందని, దీనికి ప్రభుత్వమే పూర్తి భాద్యత వహించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కాంపాంటి పృధ్వి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి సాంబ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలని, కోవిడ్ ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మొదటి సంవత్సరం విద్యార్ధులనందరినీ మినిమమ్ పాస్ మార్కులతో ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారికి డిమాండ్ల వినతిపత్రం అందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస,ి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కేవలం 49శాతం విద్యార్ధులు మాత్రమే ఉత్తీర్ణత సాధించడం ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమేనన్నారు. ఫేయిల్ అయిన 51శాతం విద్యార్ధులు, పేద, ఎజెన్సీ ప్రాంతాల విద్యార్ధులేనని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎస్కె. ఫహీమ్ దాదా, జర్పుల ఉపేందర్, రణధీర్, అనుదీప్, దుర్గ, ఎస్ఎఫ్ఐ నాయకులు సండ్ర భూపేందర్, అభిమన్యు, సందీప్, నవీన్, పవన్, యశ్వత్, పిడిఎస్యు నాయకులు జె.మంజుల, గణేష్, నరేందర్, పార్ధు తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులను పరీక్షలకు పెట్టి ఆందోళనకు గురి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలు చేసు కుంటున్న విద్యార్థులను నష్టపరిహారం చెల్లించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు గార్లపాటి పవన్ కుమార్ అన్నారు. శనివారం ఆయన ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్థం చేసి, నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు డి.వెంకటేష్, జమ్మి యశ్వంత్, తరుణ్ తేజ్, సాయి, పవన్, శ్రీ రామ్, కళ్యాణ్, స్పందన, స్వప్న, దుర్గ, ప్రసన్న, సింధు సంధ్య తదితరులు పాల్గొన్నారు.