Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ హాజరు కాని ప్రజాప్రతినిధులు,
అధికారులు
అ ఫోటో కాల్ పాటించకుండా రోడ్లకు
శంకుస్థాపన చేస్తున్న ఆర్అండ్బీ శాఖ
ఎంపీపీ ఆరోపణ
నవతెలంగాణ-చండ్రుగొండ
మండల ప్రజా పరిషత్ సర్వ సభ సమావేశం అతీ సాధారణంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు బానోత్ పార్వతి అధ్యక్షతన ముగిసింది. హాజరు కాని అధికారులు ప్రజాప్రతినిధులు వల్ల, హాజరైన అధికారులు, ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వెలిబుచ్చారు. రోడ్డు భవనాల శాఖ నిర్లక్ష్యం వలనే మండలంలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉందని, మంజూరైన రోడ్లను ప్రజలకు ప్రజా ప్రతినిధులకు తెలియకుండానే రోడ్డు పోస్తున్నారని జడ్పీటీసీ కొనకొండ్ల వెంకట్ రెడ్డి ఆరోపించారు. రోడ్డు భవనాల శాఖ వారు ఫోటో కాల్ పాటించకుండానే రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారని ఆమె ఆరోపించారు. మండల కేంద్రమైన చండ్రుగొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరారు. పంచాయతీలకు ఇసుక పర్మిషన్ ఇవ్వాలని కోరారు. మండలంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో 250 ఎకరాల్లో ఆయిల్ఫామ్ సాగుతుందని ఆ శాఖ అధికారి సందీప్ తెలిపారు. ఈ పంట మరింత విస్తరించాలని రైతులు అత్యధికంగా సాగు చేయాలని కోరారు. హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో అన్నపూర్ణ ఆదేశించారు. ఈ సమావేశంలో మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి డి.అన్నపూర్ణ, మండల వ్యవసాయ అధికారి నవీన్ బాబు, విద్యుత్ శాఖ హాట్ కార్ దేవా, ఆర్అండ్బీ ఏఈ లక్ష్మణ్ నాయక్, ఐసీడీఎస్ సీడీపీఓ నిర్మల జ్యోతి, ఎక్సైజ్ ఎస్ఐ భాష్య, యూడీసీ నరసింహారావు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.