Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
సామాజిక సేవలకు గుర్తుగా ఎన్డీవో, ఒక హృదయం ఆశ్రమ నిర్వాహకులు మిట్టకంటి సంజీవ రెడ్డికి నీతి అయోగ్ ప్రతినిధుల నుంచి ప్రశంసాపత్రం దక్కింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం డీఆర్డీఏ కార్యాలయంలో నీతి అయోగ్ అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కోలబరేటివ్ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీవోగా మిట్టకంటి సంజీవరెడ్డి చేస్తున్న సేవలను గుర్తించి నీతిఅయోగ్ ప్రతినిధులు కిషోర్, లావణ్య, జెన్నీఫర్, సచిన్‌ల చేతులమీదుగా ఈ ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యువో వరలక్ష్మి, జిల్లా ఎడ్యు కేషన్ క్వాలిటీ కోఆర్డినేటర్ నాగరాజు, జిల్లా వైద్యశాఖాధికారి శిరీష, డీఆర్డీఏ ఏపీడీ సుబ్రమణ్యం, ఎన్జీవోలు పాల్గొన్నారు.