Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
మండలం పడమట నర్సాపురం గ్రామానికి చెందిన కాజా రమేష్ గత కొన్ని సంవత్సరాల నుండి వ్యాపారంలో అభివృద్ధి వైపు రాణిస్తూ, గ్రామంలోని నిరుపేదలైన యువతీ, యువకులకు ఉన్నత చదువులకు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికీ ఎందులో ప్రావీణ్యం ఉంటే అందులో రాణించేందుకు ఎంతగానో ప్రోత్సహించి తనవంతు ఆర్ధికంగా సహాయం చేస్తూ అండగా నిలిస్తున్నారు. అదేవిధంగా వారికీ రాజకీయం వైపు మక్కువ ఉండటంతో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రామ స్థాయి ఎన్నికల్లో, మండల స్థాయి ఎన్నికల్లో అదేవిధంగా ప్రాధమిక సహకార సంఘం ఎన్నికల్లో పోటి చేసి ప్రత్యర్ధులపై ఘన విజయం సాధించారు. ప్రస్తుతం కాజా రమేష్, కాజా విజయ రాణి దంపతులు ఇరువురు, కాజా రమేష్ పడమట నర్సాపురం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్‌గా, కాజా విజయ రాణి పడమట నర్సాపురం ఎంపీటీసీగా గెలుపంది తనవంతు గ్రామలోని ప్రజలకు, పేద ప్రజలకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సహాయం చేసేవారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అదే ఉత్సాహంతో గ్రామ ప్రజలతో మమేకమైన తనవంతుగా ప్రజలకు సేవ చేస్తున్నారు. అదేవిధంగా కాజా రమేష్‌కు చిన్ననాటి నుండి క్రికెట్ ఆటపై మక్కువ ఇష్టం ఉండటంతో 1984లో క్రికెట్ టీమ్ ఏర్పాటు చేసి ఎంతోమంది యువకులను ఆటలపై ప్రోత్సహించి యువతి, యువకులకు ప్రోత్సాహం ఇస్తూ క్రికెట్ కిట్టులు, తదితర ఆటల వస్తువులను క్రీడా అభిమాన యువకులకు అందచేశారు. గ్రామంలో పరిసర ప్రాంతాల ప్రజలకు సామాన్యులకు అందుబాటులో ఉంటూ తన వంతు సహాయం అందిస్తూ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎవరికి ఇబ్బంది కలిగినా, తన వంతు సహా యం చేస్తూ ముందుండి వారిసమస్యలను పరిష్కరిస్తున్నారు. గ్రామస్తులతో మమేకమై ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి సహాయం చేస్తుంటాడు. గతంలో కరోనా కష్ట కాలంలో కూడా తన వంతు సహాయసహకారాలు అందించారు. అలాగే యువతకు విద్య, వైద్య, పరంగా, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది కలిగినా తన వంతు సహాయం చేస్తూ తన జీవనం సాగిస్తున్నారు.