Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
అనారోగ్యంతో బాధపడుతూ కాంగ్రెస్ టేకులపల్లి మండల అధ్యక్షుడు, సొసైటీ డైరెక్టర్ పెద్ద బోయిన మదనయ్య (59) మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. అకాల మరణాన్ని చింతూస్తూ పార్థీవ దేహానికి పార్టీ కండువా కప్పి పూలమాల వేసి పలువురు నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, భూక్య దేవా నాయక్, ఇల్లందు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్లావత్ సాయి, లవ కుమార్, సురేష్, భూక్య దళ్ సింగ్ నాయక్, నర్సయ్య, ఇల్లందు నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు జి.రవి, ఇల్లందు పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు భద్రం తదితరులు పాల్గొన్నారు.