Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
అన్నపురెడ్డిపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల బాలరు పాఠశాలలో కళ్యాణి మృతి చెందిన సంఘటనను, ఆమె వుండే భవనాన్ని గురుకులాల జాయింట్ సెక్రటరీ శారద పరిశీలించారు. శనివారం ఆమె గురుకులాన్ని సందర్శించి ఆమె మృతి పట్ల తీవ్ర ద్రిగ్బాంతిని వ్యక్తం చేశారు. పాఠశాలలోని విద్యార్థులు విద్యా విధానం, మెను ఎలా వుంది, పాఠశాలలోని ఉపాధ్యాయులు తీరు గురించి విద్యార్థులను ఒక్కో క్లాసు నుండి ఇద్దరు, ముగ్గురుని పిలిచి అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ సస్పెండ్ కావడంతో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌కి ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి జాయింట్ సెక్రటరీ శారద, ఆర్సీఓ ప్రత్యూష భోజనం చేశారు. అనంతరం ఉపా ధ్యాయులతో సమావేశం నిర్వహించి పాఠశాలలో క్రమశిక్షణగా ఉపాధ్యాయులు వుండాలని క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారిపైనా వేటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ చెన్నారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నూతన డార్మేట్ని ప్రారంభించాలని విన్నవించిన ఛైర్మెన్
సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకి వచ్చిన జాయింట్ సెక్రెటరీ శారద పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న డార్మెట్ భవనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మెన్ బన్నె చెన్నారావు విద్యార్థులు పాత భవనంలో చలికాలం ఇబ్బందులు పడుతున్నారని విన్నవించగా వెంటనే స్పందించిన జాయింట్ సెక్రెటరీ ఉన్నత అధికారులకి ఫోన్ చేసి వారం రోజుల్లో భవనం పనులు పూర్తి చేసి పాఠశాలకు అప్పుజెప్పాలని ఆదేశించారు.