Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
అసాంఘిక కార్యకలాపాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అడ్డాగా మారాయని మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గురజాల గోపి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాగుమల్లారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం విఫలమైందన్నారు. లక్షలాది నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తానని గాలిలో మాటలు నీటిలో రాతలు రాసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం కట్టించిన ఇల్లు కూడా పంచలేని స్థితిలో ఉందన్నారు. కట్టినటువంటి ఇల్లు కూడా మందుబాబులకు అడ్డాగా మారిందని పేకాట, అసాంఘిక కార్య కలాపాలకు ఉపయోగపడుతున్నాయన్నారు. అలాగే ప్రస్తుతం కట్టిన టువంటి ఇళ్ల నిర్మాణం కూడా నాసిరకంగా నడుస్తున్నాయని, నాసి రకంగా నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఈ పోరాటం ఉధృతం చేసి ప్రజా సమస్యలపై పోరాడతామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పాలమూరి రాజు, ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమరం రామ్మూర్తి, బీసీ సెల్ అధ్యక్షులు సాంబశివరావు, సీనియర్ నాయకులు కె.నాగేశ్వరరావు, పంచాయతీ పరిషత్ కన్వీనర్ కోన్ విజరు కుమార్ పాల్గొన్నారు.