Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 59 శాతం ఉత్తీర్ణత సాధించాలని కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు తెలియజేశారు. కళాశాల నుండి 92 మంది విద్యార్థులు హాజరుకాగా 54 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. బైపీపీ గ్రూఫ్‌లో శోభన 450 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. ఎంపీసీ గ్రూప్‌లో సత్య దుర్గ 403 మార్కులు, పావని 395 మార్కులు సాధించి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. సీఈసీ గ్రూప్ లో సిద్ధార్థ 358 మార్కులు, హెచ్ఈసి గ్రూప్‌లో చందు విజ్ఞేష్ 322 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారని తెలిపారు. ఫిజిక్స్‌లో తొమ్మిది మంది విద్యార్థులు 60/ 60 మార్కులు, బోటనీలో ఇద్దరూ, జువాలజీలో ఇద్దరూ 60/60 మార్కులు సాధించినారని తెలిపారు. వీరందరినీ కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు అభినందించారు. ఈ ఫలితాలకు కారణమైన అధ్యాపకులను ఆయన అభినందించారు.