Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పట్టింపులేని ఎక్సైజ్, పోలీస్ అధికారులు
అ ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువకు
అమ్ముతున్న వ్యాపారులు
అ వైన్స్ షాప్‌కి పేరు ఉండదు
నవతెలంగాణ-కరకగూడెం
మండల కేంద్రంలోని వైన్‌షాపులో ఎమ్మార్పీ ధరలకు అమ్మే నిబంధన ఇక్కడా అమలు కావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బీరు, క్వాటర్, పుల్ బాటిల్ ఏది కొన్నాసరే ఎమ్మార్పీ ధర మీద రూ.20 నుండి 30 అధిక ధరకు అమ్ముతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఎమ్మార్పీ ధరలకు వైన్‌షాపులో మధ్యం అమ్మాలని వినియోగదారులు ప్రశ్నిస్తే ఇక్కడ ఇంతే ఎవరికైనా చెప్పుకో అనే సమాధానం వినిపిస్తుందని పలువురు వాపోతున్నారు. ఇదే అదునుగా వైన్ షాపు యజమానులు అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న వైన్‌షాపులో ఎమ్మార్పీ ధరకు అమ్మాలనే నిబంధన ఇక్కడ కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు.
ఈ తతంగం అంతా సంబంధిత ఎక్సైజ్ అధికారులకు తెలిసినప్పటికీ వారికి ప్రతి నెల మామూళ్లుఅందుతుండడంతో తమ కేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. గ్రామస్తులు కూడా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధిక ధరకు విక్రయిస్తుండ డంతో ఇక్కడి వైన్‌షాపు వ్యాపారి 'మూడు పువ్వులు ఆరు కాయల'తో అధిక లాభాలను ఆర్జిస్తున్నాయి.
విచ్చల విడిగా బెల్టుషాపులు
మండల పరిధిలో పదహారు గ్రామ పంచాయతీలో ఉండగా ఒకటి రెండు గ్రామాపంచాయతీలు మినహా మిగిలిన అన్ని గ్రామాలలో బెల్టు షాపులు విచ్చల విడిగా కొనసాగుతున్నట్టు సమాచారం. గ్రామాలలోని బెల్టు షాపు నిర్వాహకులు కూడా మండల కేంద్రంలోని వైన్‌షాపు నుండే మధ్యం తీసుకొని వెళ్తారని వారికి కూడా ఎమార్పీ ధర కంటే ప్రతి క్వాటర్, బీరు బాటిల్‌పై రూ.40 అదనంగా తీసుకుంటారని సమాచారం.