Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పీఎస్పీడీలో పనిచేస్తూ కరోనాతో మృతి చెందిన రెండు కుటుంబాలకు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో హెచ్ఆర్ డీఎంటీలో శనివారం చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.8లక్షల విలువైన చెక్కులను టీఎన్టీయూసీ అధ్యక్షుడు కనకమేడల హరిప్రసాద్ చేతులమీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు జీవన్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, కుందూరు శ్రీనివాసరెడ్డి, రెడ్డెం రామకృష్ణారెడ్డి, హెచ్ఐర్ విభాగం నుంచి మరడాన శ్రీనివాసరావులు పాల్గొన్నారు.