Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
పామాయిల్ గెలలు నరికి లోడింగ్ చేసే రైతు కూలీల సమస్యలపై అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ ఎదుట శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పామాయిల్ రైతుకూలీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాని ఉద్దేశించి మచ్చా మాట్లాడుతూ పామాయిల్ గెలలు నరికి లోడింగ్ చేసే కూలీలలకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారికి ప్రమాదభీమా సౌకర్యాన్ని కల్పించాలని, కూలీలలకు కావలసిన గొడ్డళ్ళు, కొడవళ్ళు ఇతర సామగ్రిని సబ్సిడీపై ఇప్పించే ఏర్పాటు చేయాలని, పామాయిల్ కూలీలకు గుర్తింపు కార్డులను జారీ చేయాలని, ప్రమాదం జరిగితే భీమా, నష్టపరిహారం, పామాయిల్ ఫ్యాక్టరీ ద్వారా ఆయిల్ ఫెడ్ ద్వారా ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మచ్చా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా వ్యకాస సహాయ కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు, దమ్మపేట మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి పిల్లి నాయుడు, కూలి సంఘం ముఠా మేస్త్రిలు, మండలా ధ్యక్షుడు ఉదరుకుమార్, కలంబాబు, రమేష్, తిరుపతిరావు, నాగేంద్రరావు, రాంబాబు, వెంకటేశ్వ రరావు, రైతు సంఘం నాయకులు శ్రీనివాసరావు, లకిëనారాయణ, కేశవరావు, కూలీలు పాల్గొన్నారు.