Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వందలాదిగా తరలి వచ్చిన వచ్చిన భక్త జనం
అ శివనామస్మరణతో మార్మోగిన నర్సాపురం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని నర్సాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం (చిన్న అరుణాచలం)లో అత్యంత వైభోపేతంగా నిర్వహిస్తున్న ద్వాదశ జ్యోతిర్లింగాల విగ్రహ ప్రతిష్టా మహౌత్సవాలు శనివారం మూడవ రోజుకు చేరుకున్నాయి. మూడవరోజు జ్యోతిర్లింగాలు, పరివార దేవతల ప్రతిష్టా మహౌత్సవాలను తిరుపతి నుండి వచ్చిన వేద పండితులచే అగణంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయానికి అనుబంద ఆలయాలైప ఉపలయాల్లో జోతిర్లింగాలతో పాటు పరివారం దేవతలను ప్రతిష్టాపన చేశారు. జ్యోతిర్లింగాలు, పరివారం దేవతల ప్రతిష్టా మహౌత్సవాలలో భాగంగా ముందుగా గణపతి ప్రతిష్ట, అష్టాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ట, శిరిడి నాధుడి విగ్రహ ప్రతిష్ట, దత్తాత్రేయుడు, వెంకయ్యతాత, నాగదేవతల వంటి అదిత్యాది దేవతల ప్రతిష్టా మహౌత్సవాన్ని శాస్త్రోక్తకంగా నిర్వహించారు.
తరలి వచ్చిన భక్త జనం : నర్సాపురం గ్రామంలో జరుగుతున్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర (చిన్నఅరుణాచలం) జ్యోతిర్లింగాలు, పరివార దేవతల ప్రతిష్టా మహౌత్సవానికి శనివారం మూడవ రోజు మండల నలుమూలలతో పాటు భద్రాచలం, చర్ల వివిద ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు.