Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ధాన్యానికి గిట్టుబాటు ధర ప్రకటించాలి
అ రేపు నిరసన
నవతెలంగాణ-పినపాక
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లో గల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో రాజకీయ దురుద్దేశంతోనే ప్రవర్తిస్తుంద న్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. వర్షాకాలంకు చెందిన ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిరసనలు తెలుపుతామన్నారు. ఈ నెల 20వ తేదిన ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్దం చేసి నిరసన తెలుపుతామన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, సొసైటీ చైర్మన్ రవివర్మ,వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీను, పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు యాంపాటి సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కోనుగోలు చేయాలని జడ్పీటీసీ పోశం నర్సింహారావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కోటి 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది, కానీ కేంద్ర ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల టన్నులు కోనుగోలు చేసిందన్నారు. ఇంకా రైతుల దగ్గర అధిక ధాన్యం నిల్వలు ఉన్నయన్నారు. వెంటనే కేంద్రప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కోనుగోలు చేయాలని డిమాండు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన అన్ని మండలాల కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తామన్నారు. మణుగూరులో జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో రైతులు పాల్గోనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్ర మంలో ఎంపీపీ కారం విజయకుమారి, మండల, పట్టణ అధ్యక్షులు ముత్యంబాబు, అడపా అప్పారావు, పిఏసిఎస్ చైర్మెన్ కెవి.రావు, ఉపసర్పంచ్ శంకర్, నాయకులు జావిద్ పాష, రవి, రామారావు, సుబాని, రవి, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.