Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వెనుక బడిన జిల్లాల్లో అభివృద్ది అవసరం
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజా సమస్యలను వెలికితీయడంలో స్వచ్ఛంద సంస్థల సహకారం ఎంతో ఉందని, వెనుక బడిన జిల్లాల్లో అభివృద్ధికి ప్రభుత్వాల చేయూత ఎంతో అవసరమని జిల్లా అధికారులు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెంలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థల అభివృద్ధి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీఆర్డిఓ సుబ్రమణ్యం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జెవిఎల్. శిరీష, జిల్లా సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, జిల్లా క్వాలిటీ ఎడ్యుకేషన్ కో-ఆర్డినేటర్ నాగరాజ శేఖర్లు ప్రసంగించారు. జిల్లాలోని ప్రజా సమస్యలను వెలికితీసి స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమన్వయంతో పరిష్కారాలకుతో చూపుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 738 జిల్లాలలో వెనుకబడి ఉన్నా 112 జిల్లాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ గుర్తించింది. ఆయా జిల్లాలలో విద్య, వైద్యం, వ్యవసాయం, నైపుణ్య అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన ఇంకా వివిధ సౌకర్యాల రూపకల్పన అభివృద్ధి చేపట్టాల్సిన పని ఉందన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఏకతాటిపై తీసుకురావడానికి నీతిఆయోగ్ ఆకాంక్ష జిల్లాల సమన్వయం అనే కార్యక్రమానికి అంకురార్పణం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 17 మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మదర్ ఎన్జీవో మాగంటి వెంకటేశ్వర్ రావు, సేవా స్వచ్ఛంద సంస్థ వై.వి.కృష్ణారావు, టీమిండియా సోషల్ సర్వీస్ సొసైటీ సాదిక్ భాషా, వాష్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆత్రేయ, ఈ ఆకాంక్ష జిల్లాల సమన్వయ అధికారులు పాల్గొన్నారు.