Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
మృతి చెందిన మల్టీపర్పస్ వర్కర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మండల పరిధిలోనే గార్లపాడు గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ కనకపూడి వెంకటి గుండెపోటుతో మృతి చెందిన సంగతి విధితమే. మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు అంతోటి రమేష్ మరియు పుల్లయ్య గ్రామపంచాయతీ మల్టీ ప్లస్ వర్కర్లు ఆదివారం వెంకట్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ విధులను నిర్వహించి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆకస్మాత్తుగా కిందపడిపోయి వెంకటి మృతిచెందాడని అన్నారు. మృతుని కుటుంబం చాలా నిరుపేద కుటుంబం అని, అంత్యక్రియలు కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో కుటుంబం ఉందన్నారు. గ్రామ పంచాయతీ ఇచ్చే 8500 రూపాయలతో కుటుంబం గడవటం అతి కష్టంగా ఉందన్నారు. గ్రామ పంచాయతీ వర్కర్ల కుటుంబాలు దుర్భర జీవితం గడుపుతున్న నాయని ప్రభుత్వం చాలీచాలని జీతం ఇస్తూ తమతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి వరకు మురికి కాలువలలో చెత్తాచెదారం తొలగించి గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న మన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాల కోసం తన జీవితాలనే అంకితం చేస్తున్నామని కానీ ప్రభుత్వం మాత్రం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీపర్పస్ వర్కర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, మతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతదేహాన్ని సందర్శించిన వారిలో సిఐటియు మండల నాయకులు మంద నాగరాజు, దారా సురేష్, పూజల రామయ్య ,షేక్ ఖాసిమ్, రాము, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.