Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరా టౌన్
బోడేపూడి కళా నిలయం ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ ఆదివారం వైరా సిపిఐ(ఎం) కార్యాలయంలో జరిగే వైద్య శిబిరం 78వ నెల విజయవంతంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఖమ్మం ప్రముఖ ప్రజా వైద్యులు డాక్టర్ చీకటి భారవి, డాక్టర్ జట్ల రంగారావు, పిల్లలమర్రి సుబ్బా రావు బృందం ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. బోడేపూడి కళా నిలయం వైద్య శిబిరం ద్వారా వంద రూపాయలకే నెలకు సరిపడా షుగర్, బిపి మందులు అందించటం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రముఖ ప్రజా వైద్యులు చీకటి భారవి మాట్లాడుతూ కరోనా వైరస్ మరల విజృంభించే అవకాశం ఉందని, ప్రభుత్వం అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. షుగర్, బిపి మందులు దీర్ఘకాలంగా వాడే వారు గుండె, కిడ్నీ, న్యూరో సంబంధించిన పరీక్షలు నిర్ణితకాల పరిధిలో చేయుచు కోవాలని, చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గుండె, శ్వాస కోశ అనారోగ్య లక్షణాలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోడేపూడి కళా నిలయం సంస్థ కార్యదర్శి బొంతు రాంబాబు, వైద్య శిబిరం బాధ్యులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరావు, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మెహనరావు, కంభంపాటి సత్యనారాయణ, మాదినేని రజిని, ఐలూరి శ్రీనివాసరెడ్డి, మల్లెంపాటి ప్రసాదరావు, అనుమోలు రామారావు, మాదినేని ఉదరు పాల్గొన్నారు.