Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి జిల్లా ఆదివాసీ ప్రజలకు వైద్యార్ధికారులు ప్రాణాలు పోస్తున్నారా...? తీస్తున్నారా...? అర్ధం కాని పరిస్థితి ఉందని, ఇల్లందు ప్రజలు ఏం పాపం చేశారని వారికి వైద్యసేవలు అందకుండా పోతున్నాయని, రోగులను నిలువునా దోపిడి చేస్తున్న ప్రయివేటు అసుపత్రులపై జిల్లా వైద్యాధికారులు పర్యవేక్షణ, నిఘాలేకుండా పోయిందని, జిల్లా మిర్చి రైతాగం నష్టపోడాకిని ఉద్యాన శాఖ అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుందని, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అధికారుల తీరుపై మండి పడ్డారు.
ఆదివారం జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మెన్ అధ్యక్షతన జెడ్పీ కార్యాలయంలో జరిగింది. పలువురు జెడ్పీటీసిలు, ఎంపీపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారుల తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీవ్ర సమస్యగా ఉన్న మిరవ పంటలో తెగుళ్ల విషయంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. సకాలంలో పంటకు యాజమాన్యం చెప్పలేదన్నారు. గత నెల కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో తల్లి, పిల్ల మృతి చెందిన ఘటనపై విచారణ నిర్వహించి సమగ్ర నివేదికలు అందచేయాలని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజలకు వైద్యం అందించాలి కాని ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు ప్రాణాలు పోస్తున్నారా..? ప్రాణాలు తీస్తున్నారా..? అని అసహనం వ్యక్తం చేశారు. కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో తల్లి, పిల్ల మృతి చెందిన ఘటనపై వాస్తవాలను వెలికితీసేందుకు జడ్పీటిసిలు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశామని, సత్వరమే ఇట్టి ఘటనపై నివేదికలు అందచేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశించారు. తల్లి, బిడ్డ మరణించడమనేది చాలా భాదాకరమైన విషయమన్నారు. కారణాలు ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియక పోవడం వెనుక పలు అనుమానాలు రేకేత్తిస్తున్నాయన్నారు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరుగకుండా ఉండేందుకు విచారణ నిర్వహించి ఏ కారణం వల్ల ఇరువురు చనిపోయారో నివేదిక ఇవ్వాలని ఇల్లందు శాసనసభ్యులు హరిప్రియ చెప్పారు. గ్రామీణ వైద్యులు కార్పోరేట్ హాస్పటల్స్‌తో కుమ్ముకై కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని, రోగులను దోచుకుంటున్నారన్నారు. వీటిని నియంత్రించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ శిరీషను ఆదేశించారు.
104 సిబ్బంది పిఎఫ్ నిధులు గోల్ మాల్‌పై సమగ్ర విచారణ చేయాలన్నారు. నివేదికలను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.
యాసంగిలో పండిన ధాన్యం భారత ఆహార సంస్థ కొనుగోలు చేసే పరిస్థితి లేనందున ప్రత్యామ్నయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.