Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై చేతులెత్తిసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పిలువు నేపథ్యంలో టీఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామాలలో నిరసనలు చేపట్టాలని శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. ఆదివారం ఇమెజ్ ఫంక్షన్ హల్లో టీఆర్ఎస్ పార్టీ సమావేశం పాలెపు రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా కేంద్రం ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్దం చేయాలని, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం చేతులెత్తేసిన విషయాన్ని రైతులకు స్పష్టంగా వివరించాలని చెప్పారు. వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని అయన రైతాంగాన్ని కోరారు. యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదని, దీనికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమన్న విషయాన్ని రైతులు గమనించాలని అయన కోరారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన కార్యక్రమాలకు రైతులు, తెరాస పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సోమవారం నిర్వహించే నిరసన కార్యక్రమానికి రైతులందరూ వరి కంకులు వెంట తీసుకొని రావాలని కోరారు. నల్ల రంగు చొక్కాలు దరించి రావాలని, లేదంటే నల్ల రిబ్బన్ని షర్ట్‌కి పెట్టుకొని రావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవెల్లి రఘు, జెడ్పీటీసీ కట్ట అజయ్‌కుమార్, మండలు కమిటీ అధ్యక్షుడు పాలెపు రామారావు, రైతు సమితి మండల జిల్లా ప్రతినిధులు అక్కినేని రఘు, పసుమర్తి చందర్రావు, కాటంనేని వెంకటేశ్వర్రావు కె.ప్రసాద్ పి.రామకృష్ణ, సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీ సభ్యులు నాయకులు పాల్గొన్నారు.
తల్లాడ : తల్లాడలో ఆదివారం టిఆర్ఎస్ ఉద్యమ నాయకుడు బొడ్డు వెంకటేశ్వరరావు నివాస గృహంలో టిఆర్ఎస్ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామ గ్రామాన కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని కోరారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆర్ వి ఆర్ మోహన్ రెడ్డి, వైరా మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు డి భద్రరాజు, శీలం కోటారెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, యూసఫ్, గుండ్ల వెంకులు, ఓబుల సీతారాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలి : ఎమ్మెల్యే రాములునాయక్
నవతెలంగాణ-వైరా
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయనని మొండిగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరారూరల్, వైరాటౌన్, కొణిజర్ల మండల టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూత కాని జైపాల్,మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య,ఎంపీపీ వేల్పుల పావని, జడ్ పి టి సి నంబూరి కనకదుర్గ, టి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు,కొణిజర్ల మండల అధ్యక్షులు చిరంజీవి,రైతు బంధు మండల అధ్యక్షులు మిట్టపల్లి నాగి. దార్న రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.