Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
తెలంగాణ రాష్ట్ర నుర్బాషా దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా, తెలంగాణ రాష్ట్ర సేవాలాల్ సేనా వ్యవస్థాపకులు సంజీవ్ నాయక్ పాల్గొని ప్రసంగించారు ఈ సమావేశంలో సభాధ్యక్షులు గా జిల్లా అధ్యక్షులు షేక్ బడే సాహెబ్ వ్యవహరించారు. ముఖ్యంగా కులసంఘాలు ఐక్యంగా ముందుకు వెళ్లి హక్కులు సాధించుకోవాలని బాషా కోరారు. సంజీవ్ నాయక్ మాట్లాడుతూ దూదేకుల కులస్తులకు అండగా ఉంటూ కలసి పనిచేద్దాం అని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ లాల్ జాన్ పాషా, షేక్ మీరా, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ అన్వర్ పాషా, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యండి అబ్దుల్ కలాం, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్,భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మదార్ సాహెబ్ , జిల్లా ఉపాధ్యక్షులు షేక్ రహీం, జిల్లా మహిళా అధ్యక్షురాలు షేక్ సకినా బి, జిల్లా అధ్యక్షులు షేక్ పుల్లా సాహెబ్, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ రహీం పాషా, జిల్లా నాయకులు షేక్ సైదులు పొలిశెట్టి గూడెం,ఖమ్మం నగర అధ్యక్షులు రసూల్, మస్తాన్ వలి, రాష్ట్ర నాయకులు రమేష్ రాథోడ్, రాష్ట్ర రైతు సంఘ నాయకులు కిషన్ నాయక్ , గొడ్ల మోహన్ రావు ఎంఆర్పిఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.