Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
నవతెలంగాణ- చింతకాని
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, యువజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా యువతరం ఉద్యమించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ పిలుపునిచ్చారు. ఆదివారం చింతకానిలో జరిగిన డివైఎఫ్ఐ మండల మహాసభలో షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి మరింత నిరుద్యోగ సైన్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారని, కొత్త పరిశ్రమలు నిర్మించకుండా, ఉన్న ప్రభుత్వ సంస్థను కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని, ఇలాంటి విధానాలు ఉంటే కొత్త ఉద్యోగాలు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కరోనా తర్వాత 18 శాతానికి నిరుద్యోగ సైన్యం పెరిగిపోయిందని, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఆయన అన్నారు. అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోయినా కనీసం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో సంవత్సరాలు ఎన్ని కోట్ల ఉద్యోగాలు వస్తాయని మోడీ మాట తప్పారని, తెలంగాణ రాష్ట్రంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాటలు మర్చిపోయి చాలా కాలం అవుతుందన్నారు. వాగ్దానాలు నెరవేర్చకుండా ఎన్నికలు వచ్చినప్పుడు సారి కొత్త వాగ్దానాలు చేస్తూ యువతిని మోసం చేస్తున్నారన్నారు. అందుకే ఇలాంటి మోసపూరిత ప్రభుత్వాన్ని సహించేది లేదని, అందుకే యువత ఉద్యమాలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దెల ప్రభాకర్, ఉపాధ్యక్షులు ముత్తారావు, సిఐటియు జిల్లా నాయకులు మడిపల్లి గోపాలరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వత్సవాయి జానకిరాములు, డివైఎఫ్ఐ నాయకులు గడ్డం విజరు, బాలాజీ, వీరబాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు.