Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్మిక కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఐ(ఎం) ఆందోళన
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరం ప్రకాష్‌నగర్‌కి సమీపాన కుమ్మరి బజార్‌కు చెందిన అసంఘటిత కార్మికుడు తురక సైదులు (36) ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతిచెందాడు. మృతునికి భార్య, ఒక బాబు ఉన్నారు. ఆ ప్రాంతవాసులకు, వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా నిర్మాణ ప్రాంతాల్లో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలలని, అంతే కాకుండా రాత్రివేళ కనబడేవిధంగా రేడియం స్టిక్కెర్లు ఉపయోగించి ప్రమాదం నివారణ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం వెంటనే మృతుని కుటుంబానికి ఎక్సగ్రేషియా ప్రకటించాలని సీపీఐ(ఎం) నాయకులు ఆందోళనకు దిగారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు యర్రా శ్రీనివాస్ రావు, భూక్యా శ్రీనివాసరావు, తుషాకుల లింగయ్య, అంకటి వెంకన్న,మద్ది శ్రీనివాస్, యర్రా నగేష్, బండారి వీరబాబు, కార్పొరేటర్లు గజ్జెల వెంకన్న, కొప్పెర ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.