Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీఎస్పీ జిల్లా ఇన్ చార్జ్ కృష్ణార్జునరావు
నవతెలంగాణ-చర్ల
చర్ల మండలం వ్యాప్తంగా గ్రామగ్రామాన, సందు సందున మద్యం ఏరులై పారుతుందని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ నానమాద్రి కృష్ణార్జునరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మద్యం పాలసీ వల్ల యువత అంతా మద్యానికి బానిసలౌతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చర్ల శివారు గ్రామాల్లోనే కాకుండా పట్టణంలో గల అన్నీ కాలనీలలో బెల్ట్ షాపులు వెలిశాయన్నారు. చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరూ మద్యం సేవించడం, గొడవలు పడడం నిత్యకృత్యంగా మారిందన్నారు. ఎక్సైజ్ శాఖ ఉదాసీన వైఖరి కారణమన్నారు.
విద్యాలయాలు, దేవాలయాలు ఉన్న ప్రదేశాలను కూడా మద్యం వ్యాపారులు వదలడం లేదని, ప్రభుత్వ కార్యాలయాల పక్కన కూడా బెల్ట్ షాపుల నిర్వహిస్తుంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తన్నారని ప్రశ్నించారు. చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెల్లేదారిలో ఏకంగా ప్రభుత్వం మద్యం దుకాణం నిర్మిస్తుంటే సమాజానికి ఏం సందేశం వెలుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ అక్షరం-ఆరోగ్యం-ఆర్థికం మూల సూత్రాలుగా పనిచేస్తుందని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత విద్య, ఉపాది వైపుగా యువతను మల్లించి మద్యానికి బానిసలు కాకుండా చేస్తామని అన్నారు.