Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీని ప్రారంభించిన ఏఎస్పీ
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దేహధారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన బూర్గంపాడులో దుగ్గిరాల శ్రీరామ్ రెడ్డి ఏర్పాటు చేసిన దుగ్గిరాల ఎల్లారెడ్డి మెమోరియల్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. తొలుత టోర్నమెంట్ను ప్రారంభించి అనంతరం కొద్దిసేపు బ్యాటింగ్ చేస్తూ క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించేం దుకు ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీ యమన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, బూర్గంపాడు గ్రామ సర్పంచ్ సిరిపురపు స్వప్న, నేషనల్ టుబాకో బోర్డు మెంబర్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బూర్గంపాడు ఎస్సై సముద్రాల జితేందర్, మాజీ జడ్పీటీసీ బట్టా విజరు గాంధీ, గ్రామపెద్దలు డాక్టర్ చెన్నం సత్యనారాయణ, చెన్నం సూర్యప్రసాద్, మాజేటి రామకృష్ణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాని, స్వేరో అధ్యక్షులు వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.