Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రానికి వత్తాసు పలుకుతున్న
తెలంగాణ ప్రభుత్వం
అ బొగ్గు బ్లాకుల పరిరక్షణకు
కలిసి రావాలి
అ సీఐటీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు
పి.రాజారావు
నవతెలంగాణ-ఇల్లందు
తొలి నుండి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు దేశవ్యాప్త ఆందోళన చేస్తున్న సీఐటీయూని విమర్శించే అర్హత బిఎంఎస్‌కు లేదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.రాజారావులు అన్నారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయాలని 2015లో కోల్ మైన్స్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ బిజెపి ప్రభుత్వం తీసుకొస్తే దానికి వామపక్షాలు తప్ప అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన అంశం కార్మికులందరికీ తెలుసునన్నారు. సింగరేణిలో నాలుగు బ్లాకులను ఆక్షన్‌కి పెట్టిందెవరు? బిజెపి ప్రభుత్వమే కదా! బీఎంఎస్ నాయకత్వం కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని, బిజెపి నాయకులను కలిసిన మరుసటిరోజే సింగరేణికి సంబంధించిన మూడు బ్లాకులను మరల ఆక్షన్‌కు కేంద్ర ప్రభుత్వం పెట్టిందా లేదానే విషయం తెలియదా అన్నారు. తెలంగాణకు గుండెకాయ లాంటి సంస్థ సింగరేణి ప్రైవేటు పరం అవుతుంటే కార్మికులు ఆందోళనలతో 3 రోజుల సమ్మె నూటికి నూరు శాతం విజయవంతం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కానీ కేవలం ఉత్తరంతోనే సరి పుచ్చుకోవటం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇప్పటికైనా మన బొగ్గు బ్లాకుల రక్షణ కొరకు ఐక్యంగా పోరాటానికి ముందుకు రావాలని సీఐటీయూ కోరుతోందన్నారు. ఈ సమావేశంలో నాయకులు కుట్ల శంకర్, ఎస్సీ నబి, నరసయ్య ఖాదర్ బాబు, ఏ.రాములు, సమ్మయ్య రాయమల్లు ఆర్బి జె.రాజు, సత్యనారా యణ, విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.