Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆర్టీసీ ఉద్యోగులకు ఉచితంగా
వైద్య పరీక్షలు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రభాశంకర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని భద్రాచలం ఆర్టీసీ డీఎం రామారావు ప్రారంభించారు. ఈ శిబిరంలో ఆర్టీసీలో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులకు వైద్యులు క్రాంతికుమార్ ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో మొత్తం 110 మంది పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో ఆర్టీసీ ఉద్యోగులు శంకర్రావు, కనకదుర్గ, అల్లం నాగేశ్వరరావు, ప్రభాశంకర్ వైద్యశాల సిబ్బంది రాజు, లక్ష్మణ్, ప్రసాద్ పాల్గొన్నారు.