Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎమ్మెల్యే పాయం
నవతెలంగాణ-కరకగూడెం
మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మండలంలోని సమత్ భట్టుపల్లి, కన్నాయిగూడెం, కలవలనాగరం గ్రామాలలో పర్యటించిన, అనంతరం ప్రజలతో సమావేశం కాగా వారు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరి స్థలంలో వాళ్ళకి కట్టించాలని, రైతులు సాగు చేసుకునే పట్టా భూములకు త్రిపెస్ కరెంట్ సౌకర్యం కల్పించాలని, అర్హత కలిగిన వారికీ కొత్తగా ఆసరా పింఛన్, కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజలు తెలిపారు. గ్రామాలలో వర్షాకాలంలో నీరు నిల్వకుండా రోడ్డుకి ఇరువైపుల సైడ్ డ్రైనేజీలు కట్టించాలని పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని పాయం తెలిపారు. అలాగే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.