Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన కీర్తి శేశులు కొడేం సీతారాములు సతీమణి కోడెం సీతాకుమారి 2014 సంవత్సరంలో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) తరుఫున గుండేపుడి పంచాయతీ నుండి ఎంపీటీసీగా గెలిచారు. అనంతరం మండల వైస్ ఎంపీపీగా పదవీ అద్యతులు చేపట్టారు. నాటినుండి, పదవీ విరమణ అనంతరం నుండి ఇప్పటవరకూ ప్రజా సేవ చేస్తూ, మహిళల రక్షణ, హక్కులకోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. పేద ప్రజలకు, మహిళలకు, ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని తెలిసినా, తనను ఆశ్రయించిన వెంటనే స్పందించి అట్టి ఆడబిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాడుతున్నారు. అంతేకాకుండా సీతాకుమారి వైస్ ఏంపీపీగా మొదటిసారిగా బాధ్యతలు చేట్టిన నాటి నుండి పదవీ ఉన్నంతకాలంలో తన సొంత గ్రామమైన రామచంద్రాపురం గ్రామంలోని అంతర్గత రహదారులకు సిమెంట్ రోడ్లు వేయించి, డబుల్ ఇళ్లు నిర్మాణంలో నాణ్యతమైన ఉన్నత ఇళ్ల నిర్మాణాలు చేపట్టి అదేవిధంగా గ్రామంలోనీ మంచినీటి సౌకర్యం తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. అంతే కాకుండా కరోనా కష్ట కాలంలో పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ, కిడ్నీ వ్యాధి గ్రస్తులకు, తదితర అనారోగ్యంతో బాధపడే వారికి అండగా ఉండి చేతనైన ఆర్థిక సహాయం, నిత్యవసర సరుకులను అందచేసి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు. వీరి సేవలను గుర్తించి దిశ పౌండేషన్ వెల్ఫేర్ కమిటీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షు రాలుగా నియమితులై ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భార్య భర్తల మధ్య బేధాబి óప్రాయాలు కలిగిన వారికి వాళ్లకు భార్యాభర్తలుకు సరైన అవగాహన కల్పించి, భార్యాభర్తలు కలిసి ఉండటం లో ముఖ్య పాత్ర పోషించి, వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. మం డల ప్రజలకు సేవచేయటంలో ముందు ఉండి తన భర్త అయిన కొడెం సీతారాములు ఆశయాల కోసం పనిచేస్తున్నారు.