Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రధమ వర్ధంతి సభలో
సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు రాజారావు
నవతెలంగాణ-ఇల్లందు
దేశాల్లో రాష్ట్రాల్లో నిరంకుశ పాలన కొనసాగిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.రాజారావు అన్నారు. పట్టణంలోని 13వ నెంబర్ బస్తీలో శీలపొగు గ్రెసుమణి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆదివారం స్థూపావిష్కరించారు. అనంతరం జరిగిన సభను ఉద్దేశించి వారు మాట్లాడారు. సీపీఐ(ఎం) ఇల్లందు డివిజన్ కమిటీ సభ్యులుగా, ఐద్వా మహిళ సంఘం డివిజన్ కార్యదర్శిగా పని చేసి పార్టీ, ప్రజా సంఘాల ఉద్యమాన్ని ముందుకు తీసుకపోవడం కోసం చివరి వరకు పాటు పడిన శీలపొగు గ్రెసుమణి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
మతతత్వ బీజేపీకి, నిరంకుశ పాలన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలిపునిచ్చారు. పార్టీ ఏదైతే బాధ్యతను ఇచిందో ఆ బాధ్యతను నిర్వర్తించడంలో గ్రెసుమణి కృషి అభినందనీయం అని అన్నారు.
ఈ స్థూపవిష్కరణ, వర్థంతి సభలో పార్టీరాష్ట్ర, జిల్లా నాయకులు మాచర్ల భారతి, గుగులోత్ ధర్మ, మండల కార్యదర్శి అబ్దుల్ నబి, సీఐటీయూ నాయ కులు మంద నర్సింహారావు, సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య, కారేపల్లి నాయకులు నాగేశ్వర రావు, అలెటి కిరణ్, కృష్ణ, వజ్జ సురేష్, మోహన్ రావు, జైబున్నిసా, శంకర్, సీనియర్ నాయకులు రాములు, భూపల్లి నర్సయ్య, ప్రజా సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.