Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
పోతినేని సుదర్శన్రావు
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన బీఈడీ కళాశాల సమస్యలను పరిష్కారం చేయాలని, యూనివర్శిటికి పంపించాల్సిన అన్ని పత్రాలను వెంటనే సమర్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. అన్నిరకాల అర్హతలు వున్న వారినే కళాశాలలో నియమిం చాలని ఆయన అన్నారు. కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత వసతి కల్పించాలన్నారు.
గిరిజన విద్యార్ధులకు అత్యంత కీలకమైన బీఈడీ కళాశాలలో పర్మినెంట్ టీచీంగ్, నాన్ టీచింగ్ స్టాప్ నియమించాలని, కళాశాల వసతులు సౌకర్యాలు మెరుగు పరచటానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన అన్నారు. జిల్లాలో మిర్చికి సోకిన తెగుళ్ళ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతులను ఆదుకోవాలని, ఎకరం మిర్చికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పోడు ధరఖాస్తూలను బుట్టదాఖాలు చేయకుండా ధరఖాస్తూ దారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన అన్నారు. హక్కుదారల ఎంపికను వెంటనే ప్రారంభించాలని, గ్రామసభలు తీర్మానించి ఎంపిక చేసిన హక్కుదారలకి పట్టాలు ఇచ్చే చర్యలను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆదివారం భద్రాచలంలో నియోజకవర్గ స్థాయి సమావేశంకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సోడి కృష్ణారెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, నియోజక వర్గ కన్వీనర్ ఏజే.రమేష్, నాయకులు కె.బ్రహ్మాచారి, యం.రేణుక, యంబీ.నర్సారెడ్డి, పుల్లయ్య, గడ్డం స్వామి, కోటేశ్వరరావు, చిలకమ్మ చరణ్ తదితరులు పాల్గొన్నారు.