Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సంతానం లేని దంపతులు చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి అన్నారు. మహిళా శిశు, దివ్యాంగులు వయోవద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ అడోప్షన్ రిసోర్స్ అథారిటీ (జA=A)లో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న మేడ్చల్ కు చెందిన దంపతులు సోమవారం సాయంత్రం నగరంలోని శిశుగృహ, ప్రత్యేక దత్తత సంస్థ నుండి బాబును ఎంపిక చేసుకున్నారు. ఈ బాబును జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, జిల్లా బాలల సంరక్షణ అధికారి విష్ణువందన చేతుల మీదుగా దంపతులకు బాబును దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా పిల్లలను దత్తత తీసుకున్నా.. దత్తత ఇచ్చినా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. సంతానం లేని దంపతులు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లోని సెంట్రల్ అడోప్షన్ రిసోర్స్ అథారిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. నియమనిబంధనల ప్రకారం పిల్లల దత్తత కోసం తగిన దృవ పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా బాబును దత్తత తీసుకున్న దంపతులను అభినందించారు. శిశుగృహ అడ్మినిస్ట్రేటర్ వరలక్ష్మి, డిసిపియు సిబ్బంది తదితరులు దత్తత కార్యక్రమంలో పాల్గొన్నారు.