Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రంలోని బిజేపి ప్రభుత్వ తీరుకు నిరసనగా అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ పిలుపులో భాగంగా మండల కేంద్రంలో మెయిన్ రోడ్ మీద ధర్నా నిర్వహించి నిరసనలు వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోసు మధు, ఎంపీటీసీల సంఘం మండల కన్వీనర్ బురా ప్రసాద్, పార్టీ జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాసరావు, దొడ్డపనేని రామారావు,రాయల పుల్లయ్య, పోట్లపల్లి శేషగిరిరావు, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురభి వెంకటప్పయ్య, బిసి సెల్ మండల అధ్యక్షులు రచ్చ రామకోటయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడ్ సురేష్, యువజన విభాగం అధ్యక్షులు వడిత్య రంగ,ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు, మండల నాయకులు కొనకంచి మోషే,గడల నరేంద్ర నాయుడు,షైక్ జాన్ పాషా,పోట్లపల్లి వెంకన్న,తేజవత్ రమేష్, పగడాల వీరస్వామి, తుళ్లూరు వెంకటయ్య పాల్గొన్నారు
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం
కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపులో బాగంగా టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో రహదారిపై మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అదేవిధంగా యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు వై చిరంజీవి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కిలారు మాధవరావు, కోఆప్షన్ సభ్యులు షేక్ మౌలానా, రాయల నాగేశ్వరరావు, బాబు తదితరులు పాల్గొన్నారు.
జడ్పీటీసీ ఆధ్యర్యంలో
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపులో భాగంగా జడ్పీటీసీ పోట్ల కవిత టీఆర్ఎస్ జిల్లా నాయకులు పోట్ల శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సోమవారం మండల పరిధిలోని తీగలబంజర గ్రామంలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ని బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని వెంటనే యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కొలిపాక వెంకటేశ్వర్లు పాసంగులపాటి శ్రీను దావా విజరు ఆనుమోలు మురళి రైతులు పాల్గొన్నారు.